మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కరువు పరిస్థితుల తర్వాత అధికారంలో ఉన్న పార్టీలు గెలిచిన చరిత్ర లేదని ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పరిస్థితిని ముందుగానే అంచనా వేయడంలో విఫలమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. కరువు వచ్చిన తర్వాత అధికార పార్టీలు తిరిగి గెలిచిన సందర్భాలు చరిత్రలో లేవని తుమ్మల వ్యాఖ్యానించినట్లు సమాచారం. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు సైతం కరువు పరిస్థితుల తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల కష్టాలను పట్టించుకోకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆయన వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని తుమ్మల పేర్కొన్నారు. నీటి కొరత, విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ తర్వాత కూడా ఎల్నినో ప్రభావం కొనసాగితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే అధికార పార్టీకి ఎన్నికల్లో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
Also Read:రెండోసారి ICC చైర్మన్గా జై షా
ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చామనిఅయితే ఆ హామీ ఏమైందని గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని తుమ్మల పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పెన్షన్ పెంపు విషయంత్వం గుర్తించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం, ఇతర నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

