- Advertisement -
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి దర్శనం కోసం వస్తుంటారని….భక్తులు, నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేశామని…మినీ ఇండియా గా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరం అన్నారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలన్నారు.
- Advertisement -