పదా అన్న ఇళ్లు చూసివద్దాం… భట్టితో తలసాని

461
talasani
- Advertisement -

సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను హైదరాబాద్​లో నిర్మిస్తోన్న రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు మంత్రి తలసాని వెంట తీసుకెళ్లారు. అసెంబ్లీలో నిన్న జరిగిన చర్చలో హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని భట్టి డిమండ్ చేశారు. స్పందించిన మంత్రి తలసాని బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి వివరించారు.

అక్కడి నుంచి ఇళ్లను చూపించేందుకు భట్టిని తీసుకెళ్లారు.శాసనసభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. ప్రభుత్వానికి ఎన్నికల్లోనే డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు గుర్తుకువస్తాయని భట్టి విమర్శించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ విసిరారు.

భట్టి ఇంటికి వెళ్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించి చెబుతానని మంత్రి తలసాని పేర్కొన్నారు. అన్నట్లుగానే.. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి మంత్రి తలసాని వెళ్లారు.మంత్రి తలసాని బృందానికి భట్టి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడున్నాయో తలసాని వివరించారు. డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లను చూపించేందుకు భట్టిని తన కారులో మంత్రి తలసాని తీసుకెళ్లారు.

- Advertisement -