సివిల్ సప్లై అధికారులతో తలసాని సమావేశం

31
talasani

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు సంక్షేమ భవన్ లో సివిల్ సప్లై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం అయ్యారు. కేబినెట్ సమావేశంలో నూతన రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపధ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ,మేయర్ గద్వాల విజయలక్ష్మి,సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.