పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు: హరీశ్‌ రావు

37
harish

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,జహీరాబాద్ ఎంఎల్ఏ మాణిక్ రావు, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు….రెండుకోట్ల యాభై లక్షలు ఒక్కో డయాగ్ససిస్ సెంటర్ కు కేటాయించడం జరిగిందన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లను ప్రారంభింఛడం జరిగింది,మరో 16 సెంటర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయనున్నారని తెలిపారు. ఈ వ్యాది నిర్ధారణ కేంద్రాలు పేదలకు ఎంతో ఉపయోగంకరం కానున్నాయని చెప్పారు.

పేదలు పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో త్వరలో రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించనున్నామని…జిల్లా ఆసుపత్రిలో రెండుకోట్ల వ్యయంతో సి.టి.స్కాన్ ను ఏర్పాటు చేయనున్నాం అన్నారు. 550 కోట్లతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల మంజూరు చేశారు. 1200 మంది వైద్య సిబ్బంది ఈ వైద్య కళాశాలకు మంజూరయ్యాయి….మెడికల్ కాలేజీకి అనుబంధంగా 100 సీట్ల నర్సింగ్ కళాశాల ప్రారంభించామన్నారు.