విద్యాసంస్థలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని…. పాఠశాలల నిర్వాహకులు కూడా ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎంసీహెచ్‌ఆర్‌డీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో కలిసి సమావేశం నిర్వహించిన తలసాని..అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరమే విద్యా సంస్థలను తెరిచే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
ఖచ్చితంగా విద్యార్ధులు మాస్క్ లు ధరించేలా చూడాలని, శాని టైజర్ లు అందుబాటులో ఉంచాలని అన్నారు. అదేవిధంగా తరగతి గదిలో విద్యార్ధులు కనీస దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో తప్పని సరిగా ఒక గదిని ఐసో లేషన్ కోసం కేటాయించాలని అన్నారు.