ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు మానుకోవాలి

396
talasani
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంతటి ఘన విజయం ఏ పార్టీకి దక్కలేదని, ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని తిడితే ఓట్లు వేయరని, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తారన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితమని ఎన్నికల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. పల్లెలకు మించి పట్టణాల్లో ప్రజలు ఆదరించారని తెలిపారు. మున్సిపాలిటి పాలక వర్గాల్లో సామాజిక న్యాయం పాటించామని..అన్ని వర్గాలకు పదవుల్లో ప్రాముఖ్యత కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ మేయర్లు, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

- Advertisement -