బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉన్నాం: తలసాని

44
talasani

బర్డ్‌ ప్లూపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని…అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బర్డ్ ప్లూ పై అసత్య ప్రచారాలు చేయవద్దని తెలిపిన తలసాని..ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని చెప్పారు.

సీజనల్స్ గా వలస పక్షులు వస్తాయి…దానికి ఇబ్బంది పడొద్దన్నారు. మన దగ్గర చికెన్, ఎగ్స్ బాయిల్ చేసుకుని తింటాం దాంతో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదన్నారు. వలస పక్షల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని సూచనలు చేశామని వెల్లడించారు.

బర్డ్ ప్లూ నివారణకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఢిల్లీ,రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ బయటకి రావడంతో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేయడం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కేంద్ర పాడి పశు సంవర్థక మాంత్రిత్వ శాఖ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది కేంద్రం. అవకాశం ఉన్నంత మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచనలు చేసింది.