ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన బిఆర్‌ఎస్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్… బిఆర్‌ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే దేశ రాజధాని డిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
వివిధ రాష్ట్రాల్లో పార్టీ స్ధాపనే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా ముందుగా ఏపీపై దృష్టిసారించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే కాన్సెప్ట్‌తో ఫస్ట్ ఫోకస్ ఏపీపై సారించారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలు కీలక నేతకు అప్పగించినట్లు సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇకపై ఏపీ బీఆర్ఎస్మ బాధ్యతలు చూసుకోనున్నారని…ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రముఖులతో సంప్రదింపులు మొదలు కాగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు గులాబీ బాస్. ఈ క్రమంలోనే ఏపీలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ అనగానే అందరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు గుర్తుకొస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ కావడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తూ వస్తున్న కేసీఆర్…బీఆర్ఎస్‌కి మద్దతుగా పలువురిని ప్రచారం చేయిస్తారనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..