ఆ విషయంలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్‌:తలసాని

152
Talasani
- Advertisement -

తెలంగాణకు కాబోయే సీఎం..కేటీఆర్ అనే వార్తలు కొద్దిరోజులుగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్,బాజిరెడ్డి గోవర్దన్ బహిరంగంగా కేటీఆర్‌కు మద్దతు పలకగా తాజాగా ఈ విషయంపై స్పందించారు మంత్రి తలసాని.

కేటీఆర్ సీఎం అయితే తప్పేంది అని ప్రశ్నించిన తలసాని… తగిన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఆరేళ్ళ పరిపాలన సమయంలో సీఎం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.

కాళేశ్వరంపై బీజేపీ నేత బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ బండి సంజయ్‌… 70 ఏళ్లుగా తెలంగాణ ఎడారిగా ఉందని, తెలంగాణకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి తలసాని తెలిపారు. జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో గెలిస్తే వరదబాధితులకు రూ. 25వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని దానిని నెరవేర్చాలన్నారు తలసాని.

- Advertisement -