చెర్రీ కెరీర్‌లోనే బెస్ట్‌గా ఆచార్య..!

47
ram charan

మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. శరవరేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుండగా జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్ చరణ్‌ నిర్మిస్తుండగా ఆచార్యలో కీ రోల్ కూడా పోషిస్తున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్‌ సిద్దను రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌గా మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ పై కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. సినిమాలో ఉన్న కీ రోల్ ను చరణ్ తోనే చేయించాలని ఇన్ని నెలలు పట్టుబట్టిన కొరటాల ఎట్టకేలకు చరణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. సిద్ద పాత్ర రామ్ చరణ్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌గా ఉండనుందట.