గోపాలమిత్రులకు అండగా ఉంటాం:తలసాని

536
gopalamitra
- Advertisement -

గోపాలమిత్రులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మెదక్‌లో ఏర్పాటు చేసిన గోపాల మిత్రుల రాష్ట్రస్ధాయి శిక్షణ శిబిరంలో మాట్లాడిన తలసాని ప్రభుత్వం గోపాలమిత్రుల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.

గోపాలమిత్రుల సేవలను గుర్తించిన ప్రభుత్వం గౌరవవేతనాన్ని రూ. 8,500లకు పెంచింది. పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం, ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

మూగజీవాలకు సేవ చేస్తున్న గోపాలమిత్రులు అదృష్టవంతులు అని కొనియాడారు. శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని గోపాలమిత్రులు నైపుణ్యం పెంపొందించుకోవాలి. ప్రభుత్వం ఆశయాలను నెరవేర్చేలా గోపాలమిత్రులు కృషి చేయాలన్నారు.

- Advertisement -