ధరలు పెంచితే కఠిన చర్యలు- మంత్రి తలసాని

408
Minister Talasani
- Advertisement -

తెలంగాణ కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటికి ఒక్కరికి మాత్రం బయటికి వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు. అయితే అదికూడా ఇంటి అవసరాలకు, నిత్యావసరాలు కొనుగోలుకు మాత్రమే.

అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపారస్తులు వస్తువుల ధరల పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది విన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైతే ధరలు పెంచి వస్తువులు అమ్ముతున్నారో ఆప్రాంతాల్లో షాపింగ్‌మాళ్లు, దుకాణాలు తనిఖీ చేశారు.

ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఓ సూపర్‌ మార్కెట్‌లో సాధారణ ధర కంటే అదనపు ధరకు వస్తువులు అమ్ముతుండడాన్ని గుర్తించి షాపు నిర్వాహకులను పిలిచి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -