విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- మంత్రి తలసాని

474
- Advertisement -

సనత్ నగర్ నియోజకవర్గంలోని నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఇందులో భాగంగా పద్మారావు నగర్ పార్క్ సంబంధించి బోర్ వెల్ పనులకు భూమి పూజ చేశారు మంత్రి. అనంతరం స్థానిక ఎస్.పి కాలేజ్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 5 రూపాయల భోజనం పథకంను, బన్సీలాల్ పెట్ డివిజన్‌లో ప్రజా ఫిర్యాదుల బాక్స్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Minister Talasani

ఈ సంర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… అయిదు రూపాయల భోజనం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటేనే నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 150 ప్రాంతాల్లో 5 రూపాయల భోజన పథకం స్టాల్ లు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి విద్యార్థులు మంచిగా చదువుకోవాలి సర్దార్ పటేల్ కాలేజ్‌కి మంచి చరిత్ర ఉంది. మొదటి రోజు విద్యార్థులందరు ఉచితంగా భోజనం చేసి వెళ్లాలని కోరుతున్నామని మంత్రి తెలిపారు.

Minister Talasani

- Advertisement -