- Advertisement -
హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ను పరామర్శించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హీరో శ్రీకాంత్ ఇంటికి ఈ రోజు వెళ్లారు. శ్రీకాంత్ ను, కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. మంత్రి తోపాటు ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా ఉన్నారు.
కాగా.. సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు మేక పరమేశ్వర్ రావు తుది శ్వాస విడిచారు. గత నాలుగు నెలలుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకా వారి పాలెంలో ఆయన జన్మించారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.
- Advertisement -