కొత్త రెవెన్యూ చట్టం చారిత్రాత్మకం..

171
Minister talasani
- Advertisement -

ఈ రోజు చారిత్రక కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ యాదవ్ అసెంబ్లీ ప్రాంగణం బయట మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకం. కొత్త చట్టం తెచ్చిన సీఎం కెసిఆర్ కు అభినందనలు తెలిపారు.తెలంగాణ అంతా కొత్త చట్టంతో పండగ వాతావరణం ఏర్పడింది. పనుల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు.కొత్త చట్టంతో వారికి పెద్ద ఊరట లభించినట్టయిందని మంత్రి అన్నారు.

ఈ చట్టంతో అవినీతి బెడద పూర్తిగా తొలగిపోతుంది. కరొనపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నోట్‌పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ రాద్ధాంతం చేయడం సరికాదు. నోట్ లో ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. అన్ని అంశాలను స్వల్ప కాలిక చర్చ నోట్ లో చెప్పడం సాధ్యం కాదు. అన్నీ చేర్చితే 200 పేజీల నోట్ అవుతుంది. అక్బర్ అతి తెలివి ప్రదర్శించారు. సీఎం కెసిఆర్ అక్బర్ కు మంచిగా సమాధానమిచ్చారు. సీనియర్ సభ్యుడైనంత మాత్రాన అక్బర్ ఏదీ పడితే అది మాట్లాడతానంటే కుదరదని మంత్రి విమర్శించారు.

ప్రభుత్వం అంత అమాయకమైంది ఏమీ కాదు ..అన్నీ తెలుసు..సందర్భాన్ని బట్టి మాట్లాడతాం..మేము రాజకీయాల్లోకి ఇపుడే రాలేదు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు..మార్పు జరుగుతుంది. బాధ్యత లేకుండా అక్బర్ మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాం..ఓవర్ స్మార్ట్ గా అక్బర్ వ్యవహరించొద్దు. పార్టీల బలాబలాలను బట్టే సభ్యులకు అసెంబ్లీలో కేటాయించడం ఈనాటిది కాదు..మాకు కూడా సంఖ్యా బలాన్ని బట్టి సమయం కేటాయించాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందని మంత్రి తెలిపారు.

ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రతిపక్షాలకు పార్టీ ఆఫీస్ లు ఉన్నాయి కదా… భట్టి అపర మేధావి లా వ్యవహరిస్తుంటారు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం చేత కాదు… అక్బర్ అసెంబ్లీలో ఈ రోజు వ్యవహరించిన తీరు కాదు.. మంత్రి ఈటెల రాజేందర్ మొత్తం విషయాలను చెప్పాలంటే రెండు రోజులైనా సమయం సరిపోదు.లాక్ డౌన్ సందర్బంగా ఎంఐఎం ఒక్కటే సేవ చేయలేదు అందరూ చేశారు. అసందర్భంగా అసెంబ్లీలో మాట్లాడటం సమయం దుర్వినియోగం తప్ప మరొకటి కాదు అని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -