రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఈరోజు గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఇందులో భాగంగా శక్తి స్వరూపిణి జోగులంబా దేవాలయం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు 50 కోట్ల రూపాయలతో 3 ఎకరాల్లో యాత్రికుల సౌకర్యాలు, సాంస్కృతిక సముదాయాల అభివృద్ధి, ఫుడ్ కోర్ట్స్, అన్నదాన సత్రం, టాయిలెట్స్ బ్లాక్స్, బ్యాంకట్ హాల్, భోజన శాల, 21 అతిధి గదులతో పాటు ఆలయ విద్యుత్ అలంకరణ, పర్యాటకుల బహుళ సౌకర్యాల కోసం నిర్మిస్తున్న భవనాల పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల ఛాయా చిత్రాలను పరిశీలించి, తగు సూచనలను చేశారు. అనంతరం శక్తి స్వరూపిణి జోగులంబా అమ్మ వారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాణి దేవి, స్థానిక ఎమ్మెల్యే అబ్రాహాము, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జెడ్సీ చైర్మన్ సరితా, ఇతర ప్రజా ప్రతినిధులు, టూరిజం ఎండీ మనోహర్, అదనపు జిల్లా కలెక్టర్ రఘురామ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.