నిర్విరామంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

22
Green India Challenge

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విరామంగా కొనసాగుతోంది. నిజామాబాద్ టీఆర్ఎస్ జిల్లా సెక్రటరీ, ఎమ్మెల్సీ కవిత పీఏ రవీందర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జాన్కంపేట గ్రామంలోని లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం రాష్ట్ర మార్క్ ఫెడ్ ఛైర్మన్ మారగంగా రెడ్డి, నిజామాబాద్ జిల్లా లైబ్రరీ ఛైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వరరావు, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు.