బోయాలకు ప్రభుత్వం అండగా ఉంటది..

568
valmiki
- Advertisement -

ఈ రోజు హైద్రబాద్‌లోని రవీంద్రభారతిలో మహర్షి శ్రీ వాల్మీకి జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్,బీసీ కమిషన్ ఛైర్మన్ బి.ఎస్ రాములు ముఖ్య ఆతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రామాయణం రాసిన వాల్మీకి రామునికి సమకాలికుడు. చరిత్రలో మొట్టమొదటి ఆటో బయోగ్రఫీ రామాయణమే. సకల శాస్త్రాలు రామాయణం లోంచే పుట్టినయి. ఈ గొప్పతనం అంతా వాల్మీకిదే. వాల్మీకి రామునితో సమానం. రాముని చరితను మనకు అందించినందుకే ఆయన అంత గొప్పతనం వచ్చిందని మంత్రి అన్నారు.

srinivas goud

అలాగే తెలంగాణ ప్రభుత్వం బోయాలకు అన్ని విధాల అండగా ఉంటుంది. వెనక బడిన తరగతుల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం. వెనక బడిన తరగతుల విద్యార్థుల కోసం 240 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే. ప్రతి కుల సంఘానికి హైదరాబాద్‌లో ఎకరం భూమి ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్ ది అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

- Advertisement -