ఆదివారం మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్,ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,చిట్టెం రామ్మోహన్ రెడ్డి,ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బిజెపి నేతల వ్యాఖ్యలు జాతీయ స్థాయి నాయకుల మాదిరిగా లేవు.కేంద్ర మంత్రుల మాటలకు ప్రజలే ఆశ్చర్యపోతున్నారు.నిన్న మొన్నటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్ధించడం.. ఎన్నికలు రాగానే విమర్శించడం వారి నైజం అని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయ బిల్లు విషయంలో కేంద్రం ఎలా వ్యవహరించిందో అందరికి తెలుసు..రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందో చెప్పాలన్నారు. రైతు బంధు కాపీ కొట్టిన కేంద్రం విఫలం అయిందని ఎద్దేవ చేశారు.
తెలంగాణకు ఒక్కటైన జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారా..కేంద్రాన్ని ఎన్నో సందర్భాల్లో కెసిఆర్ సమర్ధిచారు.అంతేకాదు ప్రధాని మోడీ సైతం సీఎం కెసిఆర్‌ను పార్లమెంట్‌లో సమర్ధించారు.పేరుకు ఫెడరల్ ప్రభుత్వం.. కానీ రాష్ట్రాల్లో చిచ్చు పెట్టె యత్నం చేస్తుంది కేంద్రం. రైతు బంధు ,రైతు బీమా ,కెసిఆర్ కిట్ ఇస్తున్నందుకు మాపై చార్జీ షీట్ వేస్తారా..? ఛార్జ్ షీట్ వేయాలంటే ముందు కేంద్రంపైనే వేసి జైల్లో పెట్టాలి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కారణంగా బీజేపీ పైనే వంద చార్జీ షీట్ లు వేయాలి. చార్జీ షీట్ కాదు దమ్ముంటే కేంద్రం ఏమి చేసిందన్న దానిపై డెవెలప్ మెంట్ షీట్ వేయాలి. అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీజేపీ నేతలు హైదరాబాద్‌కు ఏమి ఇస్తారో చెపాలి.హిందూ.. ముస్లిం లను వేరు చేయాలని బీజేపీ చూస్తోంది. మేము వంద స్థానాలు గెలిచి మేయర్ పదవిని ఎంఐఎంకు ఎలా అప్పగిస్తాం. హైదరాబాద్ మేయర్ స్థానంపై టిఆర్ఎస్ నేతలే ఉంటారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమంలో ఉన్నారు..ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీకి హైదరాబాద్‌ను ఇస్తే అంబానికి అమ్మి వేయడం ఖాయం.కేంద్ర మంత్రులు అభివృద్ధికి సహకరించలి. హైదరాబాద్‌కు పెట్టుబడుల ఇప్పుడే వస్తున్నాయి..వాటిని అడ్డుకునే యత్నం బీజేపీ చేస్తోందని దుయ్యబట్టారు. మంచి పథకాలు తెస్తే మా సీఎం ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆయుష్మాన్ భారత్‌తో ప్రయోజనము లేదు..ఆరోగ్య శ్రీ దానికంటే బాగుంది. బీజేపీ గాలంకు చేపలు ఇక్కడ లేవు. స్వామి గౌడ్‌కు కెసిఆర్ ఉన్నత పదవి ఇచ్చి గౌరవించారు. స్వామి గౌడ్ పార్టీ మారరు అని మంత్రి స్పష్టం చేశారు.