దొరికితే దేవుడు కూడా కాపాడలేడు.. తస్మాత్ జాగ్రత్త- మంత్రి

73
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం హరిత హోటల్‌లో డ్రగ్స్‌ నియంత్రణపై బార్స్‌,పబ్స్‌ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో లా అండ్ అర్దర్ కంట్రోల్ ఉంది.. ఏడు సంవత్సరాలుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదు.. ఆంక్షలు విధించలేదు..హైదరాబాద్ అంటేనే భరోసా.. అని మంత్రి అన్నారు.ఒడిశా, ఏపీ లలో గంజాయి ఎక్కువ సాగు చేస్తున్నారు. అక్కడి నుండి గంజాయి కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి అరెస్టు చేసి పిడి యాక్టులు పెడుతున్నాం.. వివిధ రకాల మార్గాల్లో వివిధ రకాల పేర్లతో నగరంలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఎక్కడ గాంజా డ్రగ్స్ దందా నడిచిన ఉక్కుపాదం మోపమని సీఎం చెప్పారు.

ఎక్కువగా పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఉందని మా దృష్టికి వచ్చింది. పబ్బులో డ్రగ్స్ తో పట్టుబడితే మీ వెనకాల ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదు.. డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్న వారిని కూడా వడలవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. పబ్బుల్లో యజమానులు డ్రగ్స్ వాడకంపై దృష్టి పెట్టాలి.. జాగ్రత్తగా గమనించాలి. ఎక్సయిజ్ అండ్ పోలీస్ టీం జాయింట్ టీం ఎప్పటికప్పుడు పబ్బులను పర్యవేక్షిస్తూ ఉంటుంది.. పబ్బుల్లో డ్రగ్స్ వాడకం వెలుగులోకి వస్తే ఆ పబ్బులను నిరభ్యంతరంగా సీజ్ చేస్తామన్నారు.

డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి.. అంతేగాని పబ్బులో డ్రగ్స్ అమ్మి సంపాదిస్తామ్ అంటే కుదరదు . మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ అమ్మిన మా డిపార్ట్మెంట్ నుండి తప్పించుకోలేరు. పబ్బులో కఠినంగా వ్యవహరించండి. డ్రగ్స్ పై పిర్యాదులు చేయడానికి హెచ్చరించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కనిపించేలా పెట్టండి..అని అధికారును ఆదేశించారు. కొందరు పబ్బుల్లో అక్రమ దందాలు చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. పబ్స్ కు వచ్చిన వారు ఎన్ని సిగరేట్ లు తగుతున్నారు.. ఒక సిగరెట్ ను మరో నలుగురు పంచుకుంతున్నారా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. పబ్బుల్లో విచ్చలవిడిగా సౌండ్స్ పెడుతున్నారు.. సరి చేసుకోవాలి.. పక్కన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిమితికి లోబడి సౌండ్స్ సిస్టమ్స్ పెట్టాలి.

పబ్బులపై పర్యవేక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తాం. పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్టు మీకు అనుమానం వస్తే వెంటనే వారి వివరాలు మాకు ఇవ్వండి..వెంటనే మా పోలీసులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుంటారు. మీ కొడుకులే ఈ డ్రగ్స్ అలవాటు పడితే మీరు ఎంకరేజ్ చేస్తారా.. పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మీ దృష్టి వస్తే 18004252523 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి.. అంటు మంత్రి కోరారు.

- Advertisement -