- Advertisement -
జగ్జీవన్ రామ్ చేసిన పోరాటాలు నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు అని కొనియాడారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్….ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అన్నారు. జగ్జీవన్ రామ్ అనుసరించిన ఆదర్శాలు,చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
- Advertisement -