సీతారామాపురంలో ఒక ప్రేమ జంట‌..టీజ‌ర్

88
minister srinivas goud
- Advertisement -

శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై.. ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శక‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌’. ఈ సినిమా టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్. హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో నల్గొండ జిల్లా DCCB చైర్మన్ మహేందర్ రెడ్డి, చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, దర్శకుడు వినయ్ బాబు, నిర్మాత చందర్ గౌడ్, హీరో రణదీర్, హీరోయిన్ నందిని, హరీష్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ చూశాక ఇదొక చ‌క్కటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రమని అర్థమ‌వుతోంది. అంద‌రూ కొత్తవారు న‌టించిన ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

తెలంగాణ‌లో ఎన్నో అద్భుత‌మైన లొకేష‌న్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి క‌ల్చర్ ఉంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జ‌రుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా ప‌రిశ్రమ‌కి అన్నివిధాల స‌హ‌క‌రిస్తోంది. చిత్ర ప‌రిశ్రమ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు.

- Advertisement -