ఈత మొక్కలను నాటిన మంత్రి శ్రీనివాస్…

210
srinivas goud
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్ఎస్ పాలనలో కులవృత్తులు చేసుకునే వారు ఆత్మగౌరవంతో బతికేలా జీవిస్తున్నారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగ జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి 4 వేల ఈత మొక్కలను నాటారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మంచన్ పల్లి ప్రియాంక శివశంకర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ వై ఖురేషీ, రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -