పుట్టినరోజున మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

314
Minister Srinivas Goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సూచనల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈరోజు నా జన్మదినం సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా సందర్భం ఏదైనా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని మంత్రి పిలుపునిచ్చారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి, అందరిని కలవక పోవడం అన్యాదా భవించవద్దన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -