తమకు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అనే తేడా లేదని, తమకు తెలంగాణ అంతా ఒక్కటేనని ఉద్ఘాటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పీజేఆర్ పోతిరెడ్డిపాడును వ్యతిరేకించినప్పుడు ఆయనకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తమ పిటిషన్ లో ఇంప్లీడ్ అవ్వాలని, కానీ రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వద్దన్నా ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్లే సుప్రీంకోర్టుకు వెళ్లామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ జీవోలు రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ లు వేశామని, ఈ అంశంలో పెడర్థాలు తీయొద్దని హితవు పలికారు.