కేంద్రానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి..

113
Minister Srinivas Goud
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ఉపరితల రవాణ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్‌తో భేటి అయ్యారు. ఈ భేటీలో మహబూబ్‌నగర్ నుండి జడ్చేర్ల వరకు నిర్మిస్తున్ననాలుగు లైన్ల జాతీయ రహదారి 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అందులో 8 కిలోమీటర్ల మేర రహదారి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుండి వెళ్లడం జరుగుతుంది. జాతీయ రహదారుల శాఖ నిబంధనల ప్రకారంగా సెంట్రల్ మీడియన్‌ను నిర్మాణం చేయడం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గిరిధర్‌కు వివరించారు.

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎస్‌వీఎస్‌ మెడికల్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 8 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియన్ విత్ సీఆర్‌ఎస్‌ మాసోన్రీ నిర్మాణ పనులకు జిల్లా పరిపాలన శాఖకు బదిలీ చేయటానికి అనుమతి ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ఉపరితల రవాణ కార్యదర్శికి వినతిపత్రాన్ని సమర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్ సానుకూలంగా స్పందించారు. ఈ భేటిలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు లు పాల్గొన్నారు.

- Advertisement -