పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌..

31
kcr

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించనుంది. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. నెక్లెస్‌ రోడ్‌ ఆరంభంలో 26 అడుగుల పీవీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ సమీక్ష నిర్వహించారు.