సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచారు

374
srinivas Goud
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 66వ జన్మదినం సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి , ప్రముఖ రచయిత విజయర్కే లు రాసిన” కేసీఆర్ మహానాయకుడు”
పుస్తకాన్ని రవీంద్రభారతి లోని తన ఛాంబర్ లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాసన మండలి సభ్యులు శ్రీ కర్నే ప్రభాకర్ తో కలసి ఆవిష్కరించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నాయకుల్లో మహనాయకుడు మన తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవిత చరిత్ర, వారిలోని ప్రత్యేకతలు, తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కోటి ఎకరాల కు సాగునీరు అందించి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రత్యేక పుస్తకం తీసుకువచ్చిన రచయిత శ్రీ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి ని అభినందించారు.

కారణజన్ములు ముఖ్యమంత్రి కేసీఆర్ మహా నాయకుడిగా, ప్రజల హృదయాల్లో చరిత్రగా నిలిచిపోయారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో హరితహారం ను క్రీడాకారులతో నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు C M కప్ క్రికెట్ టౌర్నమెంట్ ను లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -