సినీ పరిశ్రమకు అండగా టూరిజం శాఖ..

316
Minister Srinivas goud
- Advertisement -

తెలంగాణలో, హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్నీ రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా వుందని తెలంగాణలో అన్నీ రాకలా సినిమాల షూటింగ్ లకు అనువైన లొకేషన్లు వున్నాయని, సినిమా షూటింగ్లు చేసుకోవడానికి కావలసిన వసతి, హోటల్ సదుపాయాలను టూరిజం హోటళ్ళ ద్వారా అందించడానికి సర్వదా సిద్దంగా వున్నామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, టూరిజం, సాంస్కృతిక శాఖామాత్యులు డా. వి. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.

ఎలాంటి నేపద్యంతో కూడిన సినిమాలు తీయడానికైనా కావలసిన చెరువులు, కొలనులు, అడవులు అందమైన భవనాలు, వన సంపద తెలంగాణలోని మహబూబ్ నగర్ నుండి మొదలుకొని ఖమ్మం వరకు అంతటా విస్తరంగా వున్నాయని, చారిత్రక నేపద్య సినిమాలు తీయడానికి ఓరుగల్లు కోటలు, శిల్పాలు, దేవాలయాలు వున్నాయని, ఆహ్లాదకరమైన పాటలను చిత్రీకరించడానికి సుందర దృశ్యాలు, జలపాతాలు, పర్యాటక ప్రదేశాలు మరెన్నో ప్రకృతి అందాలు తెలంగాణలో కేవలం గంట వ్యవధిలో ప్రయాణం చేసి చేరుకునే విధంగా ఉన్నాయని మంత్రి గారు అన్నారు.

కరోన వ్యాప్తి నేపద్యంలో దేశ వ్యాప్తంగా సినిమాల షూటింగ్లకు లాక్ డౌన్ విదించిన నేపద్యంలో వేలాది సినిమాల నిర్మాణం ఆగిపోయి లక్షలాది మంది సినీ కార్మికులు ఉపాధి కరువై ఇబ్బందులు పడ్డారని దీనిని గమనించి ప్రభుత్వం షూటింగ్లు చేసుకోవడానికి నియమాలతో కూడిన అనుమతులు ఇచ్చిన సంధర్భంలో తెలంగాణ రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు సంబందించిన ప్రోత్సాహకల గురించి మంత్రి గారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కలాభవన్, రవీంద్ర భారతి లోని మంత్రివర్యుల కార్యాలయంలో ఈరోజు జరిగింది.

గతంలో తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్ లు చేసుకోడానికి విదేశాలైన సింగపూర్, మలేషియా, థాయ్లెండ్, దుబాయి మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని తెలంగాణలో అన్నీ రకాల సదుపాయాలు ఉన్నాయని క్రీ.పూ. నాటి చరిత్ర గల కట్టడాలు, అడవులు, జల సంపద, పురాతన ఆలయాలు చాలా ఉన్నాయని, ఇవన్నీ సినీ షూటింగ్ లు చేస్కోవడానికి దోహదం చేస్తాయని, వీటన్నిటిని సహజ సిద్దమైన స్టూడియోల మాదిరిగా ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తరువాత తెలంగాణకు జలకళ వచ్చిందని, అలాగే వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్, బోగత జలపాతాలు, సమ్మక్క సారలమ్మ అటవీ ప్రాంతం, శ్రీశైలం, లక్నవరమ్, మన్ననూర్, తాడ్వాయ్, రామప్ప, ఆదిలాబాద్లోని అటవీ ప్రాంతం సహజసిద్దంగా వుండే అటవీ ప్రాంతాలు అన్నీ ఆకట్టుకునే ప్రకృతి అందాలతో అలరారుతున్నాయని, కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల దర్శక, నిర్మాతలు కరోన కారణంగా విదేశాలకు వెళ్ళి షూటింగ్లు చేస్కోలేని పరిస్తితి కాబట్టి, అన్ని టి‌వి మరియు సినిమా షూటింగ్లను ఇక్కడే చేసుకోవాలని ఆయన సూచించారు. అన్నీ నేపద్యాల సినిమాలను తీయడానికి అనువైన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయని, వీటిని ఉపయోగించుకొని సినీ దర్శక-నిర్మాతలు షూటింగ్ లను మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాలలో చేసినట్లైతే తెలంగాణ టూరిజం ప్రమోషనే కాకుండా మన తెలంగాణ చరిత్రను, ప్రదేశాలను దేశ విదేశాలకు చాటినట్టవుతుందని మంత్రి గారు అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. కే‌సి‌ఆర్ గారు, ఇండస్ట్రి మంత్రివర్యులు శ్రీ. కే‌టి‌ఆర్ గారు, సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నారని అలాగే తెలుగు సినిమా షూటింగ్ లకు, సినిమా ఇండస్ట్రి కి కావలసిన అన్ని సౌకర్యాలు, అనుమతులు, సింగల్ విండో క్రింద ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా వుందని చెప్పారు.

చివరగా సినీరంగం నుండి కొంతమంది కెమరామేన్లు, టూరిజం శాఖ నుండి కొంతమంది అధికారులతో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి టూరిజం శాఖలోని అన్ని ప్రదేశాలను, కట్టడాలను సందర్శించి ఒక రోడ్ మాప్ ను తయారుచేసి, క్షుణ్ణంగా చర్చించి తెలంగాణ సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం నుండి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, కరోన కారణంగా విదేశాలకు వెళ్లలేకపోయిన సినీ దర్శక నిర్మాతలు ఆ విదేశీ లొకేషన్లను తలదన్నెలా వున్న మన స్థానిక పర్యాటక ప్రదేశాలను గుర్తించి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను, చరిత్రను ప్రతిబింబించేలా చేయడంలో సినీ రంగ పరిశ్రమ కూడా సహకరించాలని మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -