క్రీడా హబ్‌గా తెలంగాణ: శ్రీనివాస్ గౌడ్

183
srinivas
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో 7H మీడియా ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ -2, T -20 క్రికెట్ టౌర్నమెంట్ బ్రోచర్ ను క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డితో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నిత్యం వార్తా సేకరణలో బిజీగా ఉండే మీడియా సంస్థలలో పనిచేస్తున్న విలేఖరుల కోసం వారికి కాస్తంత ఆటవిడుపు ఇవ్వాలని ఫిబ్రవరి 22 నుండి నిర్వహించబోతున్న క్రికెట్ లీగ్ నిర్వాహకులను, స్పాన్సర్ లను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడల అభివృద్ధి కి CM కేసీఆర్ గారు స్పోర్ట్స్ పాలసీ ని ప్రకటించారన్నారు.

భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రం ను క్రీడా హబ్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. ఈ టౌర్నమెంట్ లో 16 Print మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల విలేకరులు పాల్గొంటున్నారన్నారు. 16 మీడియా సంస్థల కెప్టెన్లు సమక్షంలో టౌర్నమెంట్ లో పాల్గొనే జట్ల జేర్సీ లను డ్రా తీసి నిర్వాహకులకు అందించారు. ఈ టౌర్నమెంట్ ను T20 Cricket టౌర్నమెంటు లీగ్ మరియు Knockout పద్దతిలో ఈ లీగ్ ని నిర్వహించబోతున్నామన్నారు. ఈ లీగ్ ను ఫిబ్రవరి – 22 నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమము ను నిర్వహిస్తున్న 7H Sports ను అభినందించారు.

- Advertisement -