హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

256
srinivas goud
- Advertisement -

హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు…సెక్షన్ 8 అంటే నాలుక కోస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కొత్త సచివాలయం నిర్మాణంపై కాంగ్రెస్,బీజేపీ నాయకుల తీరును తప్పుబట్టారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధిస్తే …సెక్షన్ 8 అంటూ ఆంధ్రా పాట పాడుతారా అని మండిపడ్డారు.

టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్‌ గౌడ్‌…..ఇప్పుడున్న సచివాలయంలోకి ఫైర్ ఇంజన్ కూడా పోలేని పరిస్థితి ఉందని, క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రస్తుత సచివాలయంలో చాలా సార్లు అగ్ని ప్రమాదలు జరిగాయని గుర్తుచేశారు.

హైదరాబాద్ తెలంగాణదేనని….సచివాలయం గురించి మాట్లాడితే భరిస్తాం కానీ సెక్షన్ 8 అంటే ఊరుకోమన్నారు. కోర్టును ధిక్కరించి విపక్షాలు మాట్లాడుతున్నాయని‌… ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు ని సీటు కాపాడుకో అని హితవు పలికారు.

- Advertisement -