భూదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషకరం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. భూదాన్ పోచంపల్లికి ఇన్ని రోజులు ఎందుకు గుర్తింపు రాలేదో ఆలోచన చేయాలన్నారు. రామప్ప దేవస్థానానికి గుర్తింపు 60 ఏళ్ళ ముందే వస్తే మరింత అభివృద్ధి చూసే వాళ్ళం అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు- పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందన్నారు. నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టలో చీరను నెచిన ఘనత భూధాన్ పోచంపల్లిది అన్నారు.
ఇవాంక ట్రంప్ కు ఇచ్చిన చీర భూధాన్ పోచంపల్లిదేనన్నారు. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా గా భూధాన్ పోచంపల్లికి ఉంది…గుర్తింపు కోసం 70 దేశాలకు పంపామన్నారు. భూధాన్ పోచంపల్లి లాంటి అరుదైన ప్రాంతాలు- చరిత్రలు తెలంగాణ గడ్డపై ఎన్నో ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత భాషను- యాసను అవమానించారన్నారు. మేము చేసే ప్రయత్నాలకు ఫలితాలు వస్తే ముందుగా గుర్తింపు ఇండియాకు వస్తదన్నారు. త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోందన్నారు. దేశం మాది- అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.
ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కోలా సవతి తల్లి ప్రేమ చూపకుండా కేంద్రం నిధులు విడుదల చేయాలన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశంగా ఈ ప్రాంతం ఉంది… ఆ మూలాలు ఇంకా పోలేదన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో టెక్స్ట్ టైల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రామప్ప అభివృద్ధికి 300కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. భూధాన్ పోచంపల్లి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతున్నా… త్వరలోనే కిషన్ రెడ్డి ని కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని కొరుతాం అన్నారు. మేడారం కు మేము 75 కోట్లు ఇచ్చాము.. మీరు కేంద్ర ప్రభుత్వం తరపున 100 కోట్లు ఇవ్వాలన్నారు.