రాబోయే తరాలకు మంచి వాతావరణం అందిద్దాం

407
Minister Niranjan Reddy
- Advertisement -

రాబోయే తరాలకు మంచి వాతావరణం అందిద్దాం అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కృష్ణ – గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్ , శాస్త్రవేత్త డీఆర్ఎస్ రెడ్డి , వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నత మరియు వివిధ జిల్లాల అధికారులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలని తెలిపారు. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున..నీటి లభ్యత తగ్గిపోతుందన్నారు. ప్రజలకు అవసరమయిన వాటిని వదిలేసి మన దేశ రాజకీయాలు ఇంకో వైపు వెళ్తున్నాయి.

Niranjan Reddy

పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తల పదేళ్ల ఆందోళనల ఫలితమే గంగా శుద్ధి నిర్ణయం అన్నారు. గోదావరి , కృష్ణానది పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కృష్ణ – గోదావరి జలాలు సీవేజ్ తో కలుషితం అవుతున్నాయని తెలిపారు. నదిలోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. నదులకు ఐదు కిలోమీటర్ల దూరం నుండి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలి. కృష్ణ – గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతో పాటు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉందన్నారు.

- Advertisement -