ప్రభాస్‌ 20… రిలీజ్ డేట్ ఫిక్స్..!

987
prabhas
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాన్ నటిస్తున్న చిత్రం జాన్‌. యువీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా అప్పుడే రిలీజ్ డేట్‌ని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. 2020 దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ నటించిన సాహో బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌నే కాదు సాధారణ ప్రేక్షకులను సైతం నిరాశ పర్చింది. ఈ నేపథ్యంలో జాన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు ప్రభాస్. మరి ప్రభాస్ అంచాలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో వేచిచూడాలి.

Jaan is the tentative title that is being considered for this period romantic drama in which Prabhas plays the role of a palmist. Prabhas Jan

- Advertisement -