నియంత్రిత వ్యవసాయంతో లాభసాటి: మంత్రి

371
Satyavathi Rathod
- Advertisement -

మాహబూబాబాద్ లోని నందన గార్డెన్‌లో నియంత్రిత సాగు విధానం-లాభసాటి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు మరియ రైతు సమితి కో ఆర్డినెటర్లతో అవగాహన సదస్సులో పాల్గొన్నారు మంత్రులు దయాకర్ రావు,సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,రెడ్యానాయక్,రాష్ట్ర రైతు బంధు ఛైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,జెడ్పి ఛైర్మెన్ బిందు.కలెక్టర్ విపి గౌతమ్,రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్,మున్సిపల్ చైర్మన్ రాం మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రథోడ్ మాట్లాడుతూ..రైతు బాగుండాలి అనే మాటలు చెప్పి ఆచరణ మరిచిన నాయకులు ఎందరో ఉన్నారు.కానీ చెప్పిన ప్రతి మాటను ఆచరణలో పెట్టి అమలు చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు. శిస్తూ మాఫీ తోనే భూ, రైతు ప్రక్షాళన మొదలెట్టిన గొప్ప సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి తెలిపారు. మహాబూబాబాద్ జిల్లాలో అన్ని రకాల పంటలు పండుతాయి, మామిడి, మిర్చి,పసుపు,పత్తికి మాహబూబాబాద్ జిల్లా ప్రసిద్ధి. తెలంగాణలో ప్రతి రైతు ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ మాటలను విన్నారు.మరొక్కసారి సీఎం కేసీఆర్ సూచనలను ఆచరిస్తే రైతు జీవితాల్లో సమూల మార్పులు వస్తాయన్నారు.

Minister Satyavathi Rathod

గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు,వారి సూచనలు ప్రతి రైతు పాటించాలి. పంటల నియంత్రిత విధానాన్ని ఆచరిస్తే లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుంది. జిల్లాలో ఇప్పటికే వానాకాలం సాగుకు కావలసిన అన్ని రకాల మందులు,విత్తనాలు అందుబాటులో ఉంచారు. కరోన లేకుంటే తెలంగాణలో ఇంకా అభివృద్ధి సాధ్యం అయ్యేది. రుణ మాఫీ విషయంలో రాజీ పడని గొప్ప సీఎం కేసీఆర్, కరోన వేళా రాష్టం నష్టాన్ని చవి చూసిన మాట తప్పని గొప్ప సీఎం కేసీఆర్. ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఇస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు రైతుల్లో ఉత్సాహన్నీ నింపాయి అని మంత్రి తెలిపారు.

- Advertisement -