ఎంపీ అరవింద్‌పై మండిపడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌..

449
Minister Srinivas Goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూటీగా సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రియలిస్ట్‌లపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు పార్టీ పాలసీనా..? వ్యక్తిగతమా..? అని అడిగిన ప్రశ్నకు మంత్రి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు.. అరవింద్ ఇండస్ట్రియలిస్ట్ లను భయపెట్టాలనుకుంటున్నారు.

వేలాది మందికి ఉపాధికల్పించిన జూపల్లిపై బురదజల్లుతున్నారన్నారు. కష్టపడి ఎదిగిన తెలంగాణ బిడ్డ జూపల్లి.. నిజాయితీ కల్గిన పాలమూరు బిడ్డగా అభివర్ణించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దొచుకుపోయిన వాళ్ళను వదిలేసి.. అరవింద్ తెలంగాణ బిడ్డలపై బురదజల్లుతున్నాడన్నారు. కాంగ్రెస్ హయాంలో వందల ఎకరాలు ఆంధ్రోళ్లకు దారాదత్తం చేసిన చరిత్ర ఉంది. వాటిపై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు మంత్రి.

ఇండస్ట్రియలిస్ట్ లను భయపెట్టడం బీజేపీకి మంచిది కాదు,తెలంగాణకు మంచిది కాదని హితువు పలికారు శ్రీనివాస్ గౌడ్.అరవింద్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం స్పందించాలన్నారు.అరవింద్.. ముందు పసుపు బోర్డుపై దృష్టి పెట్టమని మంత్రి సూచించారు.కేంద్రంలో అధికారం మీదే కదా.. తప్పులుంటే చర్యలు తీసుకోవచ్చు కదా.. ప్రెస్ మీట్‌లు పెట్టి ఆరోపణలు చేయడం దేనికి అని అన్నారు. హిందుత్వంపై బీజేపీ ఒక్కటే పత్వా తీసుకునట్లు మాట్లాడుతున్నారు.తెలంగాణాలో మతం పాలిటిక్స్ నడువవు. బీజేపీ బట్టగాల్చి మీద వేయడం మానుకోవాలన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాపై బీజేపీ ఎందుకు మాట్లాడదన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -