రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి- మంత్రి

33
Minister Satyavathi

నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా మరిపెడలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్యే శ్రీ రెడ్యా నాయక్, నూకల రంగారెడ్డి, కొంపల్లి శ్రీనివాసరెడ్డి, తదితరుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే కొంతమంది గంగిరెద్దుల వలె వస్తున్నారని, వారికి ఈ ప్రాంత సమస్యలు తెలియవన్నారు మంత్రి. అలాంటి వారిని ఎన్నుకుంటే మనకు జరిగే ఉపయోగం ఏమీ ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే అన్ని వర్గాల గౌరవం పెరిగిందని, ఉద్యోగుల వేతనాలు పెరిగి, భద్రత వచ్చిందన్నారు. కానీ కొంత మంది ప్రతిపక్ష నేతలు అమావాస్య, పున్నానికి వస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి.

ఇలాంటి వారికి ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి. మన సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద చెప్పే చనువు ఉన్న నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.