గత ఏడు సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో వరంగల్‌ను అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంతా తామే చేశామని అనడం సిగ్గుచేటన్నారు రాష్ర్ట మంత్రి సత్యవతి రాథోడ్. శనివారం హబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బీజేపీ నాయకులపై మండిపడ్డారు.
మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైందని బీజేపీ నాయకులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ర్ట మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. వీటి ఏర్పాటుకు ఎన్నిసార్లు తిరిగిన కేంద్రం మాత్రం పట్టించుకోలేదన్నారు..కేవలం ఎన్నికలు వస్తున్నాయి అనే బీజేపీ నాయకులు వరంగల్‌కి వస్తున్నారన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులు ఆలోచించాలన్నారు.
2000 సంవత్సరంలో వచ్చిన గిరిజనులకు మేలు చేకూర్చే జీవో నెంబర్ 3 మీద బీజేపీ రాష్ట్ర నాయకులు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదన్నారు. ఇన్ని రోజులు ఖమ్మం, వరంగల్ గుర్తుకురాని బీజేపీ నాయకులకు ఎన్నికల ముందు ఇప్పుడు ఈ పట్టణాలు, ప్రజలు గుర్తుకు వస్తున్నారా అన్నారు. వరంగల్ వరద ప్రజలని ఎప్పుడూ చూడని బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఎద్దేవ చేశారు.