ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. భూపాలపల్లి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్దికి తొలి స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అద్భుతంగా కృషి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్బతం అన్నారు.
రైతులకు రెండుపంటలకు నీరు, 24 గంటలు ఉచిత కరెంట్, పల్లెలో అందరూ సంతోషంగా ఉండాలని పల్లె ప్రగతి అమలు చేస్తున్నారు.ఉద్యమ స్పూర్తితో ఎన్నికల్లో 63 సీట్లు వస్తే నాలుగున్నర ఏళ్ళ పాలన తర్వాత 80సీట్లు వచ్చాయంటే ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం అన్నారు. నాకు తొలి మహిళా ఎమ్మెల్సీ ఇచ్చి, తొలి మహిళా మంత్రిని చేసిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలు కాపి కొడుతున్నాయని అన్నారు.