లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్!

267
Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల..వైకుంఠపురంలో చిత్రం రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్య పాత్రలో నటించింది. ఇక ఈమూవీ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటివలే ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి నుంచి బన్ని ఈమూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడని తెలుస్తుంది.

ఇక ఈసినిమాలో బన్ని క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని సమాచారం. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. రంగస్ధలం సినిమా తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించనుందని సమాచారం. బన్ని సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య, ఆర్య2 సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.