సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మెళ్ళ చెరువు మండలం హేములతండా, జగుతండా, కప్పలకుంటతండ,పలు తండాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్,ఉప ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు,పలువురు నాయకులు,పార్టీ శ్రేణులు తరలివచ్చారు.
ఈ సభలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన బిడ్డనైనా నాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన మహా నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. హుజూర్‌నగర్ ఎన్నికల్లో తడాలన్ని ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపాలి. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని మంత్రి తెలిపారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండలను గ్రామ పంచాయతీలుగా చేసి గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది.హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గిరిజన బిడ్డలు సంపూర్ణ మద్దతు తెలిపాలి. ఉత్తమ్‌కు ఓటేస్తే హుజూర్‌నగర్‌లో మళ్ళీ పేకాట క్లబ్‌లను,ఇసుక మాఫియాను, గుండాలను పెంచి పోషిస్తాడు. ఉత్తమ్ గిరిజనులను ఓటు బ్యాంకు గానే వాడుకున్నడు. తాండలను, వారి సమసస్యలను కన్నెత్తి కూడా చూడలేదు ఉత్తమ్.అధికారం కోసం ఎంతకైనా దిగజరే మనస్తత్వం ఉత్తమ్ ది.ఉత్తమ్ మాయ మాటలను నమ్మొద్దు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉత్తమ్ కుటుంభం లబపడుతుంది. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హుజూర్‌నగర్ ప్రజలు బాగు పడతారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చావు తప్పి లొట్టబోయి గెలిచిన ఉత్తమ్‌కు ఈసారి ఓటమి తప్పదు.హుజూర్‌నగర్‌లో గులాబీ సైనికులు ఉత్సాహంగా పని చేస్తున్నారు. సైదిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయం అయ్యింది అని లింగయ్య యాదవ్ అన్నారు.