శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి..

253
sathyavathi rathod

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఉదయం వీఐపీ విరామం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి…తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితో అయిన పోరాటం చేస్తారు కేసిఆర్ అని చెప్పిన మంత్రి హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అన్నారు.

కృష్ణా జలాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం అన్నారు. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో ఈ అంశం కోర్టుకి వెళ్లింది. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదు అన్నారు.