పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు: మంత్రి సత్యవతి

225
sathyavathi rathod
- Advertisement -

గిరిజన మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు వి.హబ్ తో ఒప్పందం చేసుకోవడం మంచి పరిణామం అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సంక్షేమ భవన్ లోని నెహ్రూ ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆదివాసీలు, గిరిజనుల గ్యాలరీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్ సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి…గిరిజన బిడ్డలు మాతృ భాషను వదిలి తెలుగు భాషలో చదువుకోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం గిరిజన భాషల్లో పుస్తకాలు తేవడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలన్నారు.

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానం ఉట్టిపడేలా గిరిజన మ్యూజియాన్ని బాగా రూపొందించారని ప్రశంసించారు. ఆదివాసీలకు మేమున్నాము అనే విధంగా వారికి అన్ని హక్కులు, వసతులు కల్పిస్తూ వారిని అందరితో సమానంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -