బాలల హక్కుల పరిరక్షణకు కృషి:సత్యవతిరాథోడ్

317
sathyavathi rathod

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్రంలో బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా వారిని తప్పక శిక్షిస్తామని, బాలల హక్కులను రక్షిస్తామని గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు…

చాచా నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం….సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాలల హక్కుల కు రక్షణ కవచంలా రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేస్తున్నాం అని తెలిపారు. బాల బాలికలకే కాదు తల్లి గర్భం దాల్చినప్పటి నుంచే ఆమెకు పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు.

బాలల హక్కులు, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని…గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతలు చేసి చూపే ప్రభుత్వం అన్నారు. చేయని నేరాలకు బలై హోమ్స్ లలో అనేక మంది బాలలు ఉన్నారు, వీరి రక్షణ కోసం స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ఒక తల్లి, తండ్రి, గురువు వలె ఉంటుందన్నారు.

ఈ శాఖలోని అధికారులు, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నామని, ప్రేమతో సేవ చేయాలనే లక్ష్యం తో మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు. రాష్ట్రంలోని బాల, బాలికలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం బాలల సంరక్షణ కోసం మనసు పెట్టి అహర్నిశలు పని చేస్తాం, ఒక రక్షణ కవచంలా ఉంటామన్నారు.

బాలల చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తాం అని ….సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. బాలలుగా ఉండే ప్రతి ఒక్కరి బాల్యం అనే హక్కు కు ఎవరు భంగం కలిగించినా వారిని ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది…మిమ్మల్ని రక్షిస్తుందన్నారు.

మీ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఉందన్నారు చైర్మన్ జె. శ్రీనివాసరావు . బాధ్యతలతో హక్కులు వస్తాయని, మీరుండే ప్రాంతం, వ్యవస్థలలో బాధ్యతగా ఉందామని..మీ హక్కులను కాపాడుకుందామన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన బాల, బాలికలకు అవార్డులు ఇచ్చి అభినందించారు.