సిద్ధిపేట గ్రంధాలయానికి గొప్ప చరిత్ర ఉంది

232
harishrao

సిద్దిపేట గ్రంధాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా గ్రంధాలయం లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి హరీశ్ రావు, జడ్పీ చైర్మన్ వేలేటి రొజాశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గ్రంధాలయం ద్వారా ఎంతో మంది గొప్ప వ్యక్తులుగా ఎదిగారన్నారు.

ఈగ్రంధాలయం పురాతనమైంది. నూతన గ్రంధాలయం నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు కేటాయించి నిర్మిస్తున్నాం. వచ్చే మార్చ్ నెలలో నూతన గ్రంధాలయాన్ని ప్రారంభిస్తాం. మహిళలకు,పురుషులకు,విద్యార్థులకు వేరువేరుగా విభాగాలను ఏర్పాటు చేస్తున్నాం. పుస్తకం మంచి నేస్తం..నేటితరం సెల్ ఫోన్ మోజులో పడి పుస్తక పఠనం మరిచిపోతున్నాం. సెల్ ఫోన్ లకు బానిసలై పుస్తకాలను మరిచిపోతున్నాం. జిల్లాలో 7 మండలాల్లో నూతన గ్రంధాలయాన్ని నిర్మిస్తామని హామి ఇచ్చారు.