పల్లా రాజేశ్వర్ రెడ్డి అందరి బంధువు: మంత్రి సత్యవతి

180
sathyavathi rathod
- Advertisement -

పల్లా రాజేశ్వర్ రెడ్డి మన అందరి బంధువన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్, మరిపెడ బంగ్లా లో వేర్వేరుగా జరిగిన మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ స్థాయి వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశాలకి హాజరైన సత్యవతి..పట్ట భద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు.

మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కి ఎదురు లేదన్నారు. సిఎం కేసిఆర్ అందిస్తున్న తరహా పరిపాలన దేశంలో ఎక్కడా లేదు…మనం దరికీ అందుబాటులో ఉండే అభ్యర్థి, పార్టీ మరోటి లేదు అన్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల అభివృద్ధి మాకు వదిలేయండి…గెలుపు మీద మాత్రం మీ దృష్టి పెట్టండన్నారు.

కేసీఆర్ పాలనలో మనముండటం మన అందరి అదృష్టం అన్నారు ఎంపీ మాలోత్ కవిత. కేసీఆర్ తరహా పాలన అందిస్తామని ప్రతిపక్షాలు చెప్పటం లేదు. అబద్దాలు మాత్రమే చెబుతున్నాయని…అభివృద్ధి, సంక్షేమంలో కెసిఆర్ కి ఎవరూ సాటి రారు. లేరు అన్నారు.

- Advertisement -