సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు రైతు బంధు: మంత్రి సత్యవతి

208
green challenge
- Advertisement -

సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు రైతు బంధు కొనసాగుతుందని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాలో 90లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కావడంతో రైతుల కష్టాలు తీరుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ఉన్నంతవరకు రైతుబందు కొనసాగుతుందని… ఉపాధి హామీని వ్యవసాయ పనులకు ఉపయోగించబోతున్నాం అని చెప్పారు. 25 వేల లోపు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయబోతోంది ప్రభుత్వం అన్నారు.

వరంగల్ రూరల్ 6వ విడత హరితహారం కార్యక్రమం సందర్భంగా నర్సంపేట నియోజక వర్గం లోని దుగ్గొండి మండలం గిర్ని బావి లో మొక్కల్ని నాటారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావు , జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

- Advertisement -