మహేశ్వరం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో 30 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ భవనానికి (నాలుగు కోట్ల రూపాయలు) మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసి.. 108 అంబులెన్స్ లను ప్రారంభించారు. అదేవిధంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు 108 అంబులెన్స్ సర్వీస్‌ను వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ వార్డులో నీటి సరఫరాను ప్రారంభించారు మంత్రి.
ఇక భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు 5 కుటుంబాలకు మంత్రి డ్రై రేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రమా జ్యోతి మరియు మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మారి స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ వెంకన్న మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ ,మారి కౌన్సిలర్లు సురేందర్, అశోక్ మరియు మారి ఛాంపియన్ శివాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.