50 శాతం విద్యార్థులకే అనుమతి: మంత్రి సబితారెడ్డి

152
minister sabitha reddy
- Advertisement -

రాష్ట్రంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఉచిత వృత్తి కోర్సుల్లోని తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉన్నత విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ప్రతి కళాశాల తరగతుల వారీగా ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్గదర్శకాలను అనుసరించి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో తరచూ తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి యూనివర్సిటీకి 20 లక్షల రూపాయల తక్షణమే విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను ఆదేశించారు. కళాశాలలో పూర్తిగా సురక్షితమైన భావన కల్పించాలని మంత్రి సూచించారు. కళాశాలల్లో విద్యార్థులు యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యానిదే అని మంత్రి అన్నారు

- Advertisement -